అల్లం చాయ్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. జీర్ణాశయాన్ని శుభ్రం చేసి అరుగుదల బాగుంటుంది. అజీర్తిని సమస్య ఎదురుకాదు. వికారం ఉన్నా తగ్గుతుంది. ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారు ఈ చాయ్‌ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలానే జలుబూ, అలర్జీల వంటివి కూడా అల్లం తీసుకోవడం వల్ల త్వరగా తగ్గుతాయి.
అల్లంలో అమినో ఆమ్లాలూ, విటమిన్లూ, ఖనిజాలూ.. అధికంగా ఉండటం వల్ల హృదయానికి రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. హృద్రోగాలూ ఇబ్బంది పెట్టవు.
నెలసరి సమయంలో చాలామంది కడుపునొప్పితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు కప్పు అల్లం చాయ్‌లో చెంచా తేనె వేసి తాగితే ఫలితం కడుపు నొప్పితోపాటూ, అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది.