header

Barley Upma…బార్లీ ఉప్మా

Barley Upma…బార్లీ ఉప్మా
కావలసినవి
బార్లీ రవ్వ: 200 గ్రాములు
గోధుమ రవ్వ : 50 గ్రాములు
నూనె : 2 టేబుల్‌స్పూన్లు
ఉల్లిపాయ: ఒకటి
క్యారెట్‌ : 1
బంగాళాదుంప : 1
బీన్స్‌ : కొద్దిగా
అల్లం: చిన్నముక్క
పచ్చా బటానీలు : 50 గ్రాములు టొమాటో: ఒకటి
తిరగమాత గింజలు : 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి: రెండు
ఎండుమిర్చి: ఒకటి
కరివేపాకు: 2 రెబ్బలు
ఉప్పు: తగినంత
మంచినీళ్లు: రెండు గ్లాసులు సుమారుగా
నిమ్మరసం: టేబుల్‌స్పూను
కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారుచేసే విధానం
బార్లీ గింజల్ని మిక్సీలో వేసి రెండు, మూడుసార్లు తిప్పితే రవ్వ తయారవుతుంది.
అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, బంగాళాదుంపు అన్నీటినీ సన్నగా తురమాలి.
పాన్ లో నూనె వేసి కాగాక, ఎండుమిర్చి, తరువాత తిరగమాత గింజలు వేసి వేగాక ఉల్లిముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసి వేయించాలి. వేగాక పసుపు, టొమాటో ముక్కలు, పచ్చి బటానీలు వేసి ఉడికించాలి. మిగిలిన కూరగాయ ముక్కలన్నీ వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగిన తరువాత బార్లీ రవ్వ, తగినంత ఉప్పు వేసి సన్నని సెగమీద ఉడికించుకోవాలి. దించేముందు కొత్తిమీర చల్లుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఉడికే ముందు అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవాలి