header

Veg Atukula Upma


వెజ్ అటుకుల ఉప్మా
కావలసినవి
అటుకులు : పావుకిలో
ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి
బీన్స్ : 2 చిన్నముక్కలు గా కట్ చేయాలి
బంగాళా దుంప : 1 చిన్న ముక్కలుగా తురుముకోవాలి
టమాటో : 1 పెద్దది చిన్నముక్కలుగా తరుగుకోవాలి
పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి
కేరెట్ : 1 మీడియం సైజ్ సన్నగా తురుముకోవాలి
పాలకూర : 1 కట్ట సన్నగా ముక్కలు చేయాలి
అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి
కరివేపాకు : కొద్దిగా
వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా
నూనె : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
నీళ్ళు : 5 కప్పులు
పోపుగింజలు : 1 స్పూను
ఎండుమిర్చి : 2
తయారు చేయు విధానం
ముందుగా అటుకులను నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉంచి నీరు వడపోసి అటుకులను నీరులేకుండా గట్టిగా పిండుకోవాలి. ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, కేరెట్, తరిగిన పాలకూర, టమాటో ముక్కలు వేసి అవి వేగిన తరువాత అటుకులు, తగినంత ఉప్పు కలుపుకోవాలి. 2 నిమిషాలు పాటు వేయించి దించుకోవాలి. కొత్తిమీర చల్లి వడ్డించాలి. ఇష్టమైన వారు ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవచ్చు.