కావలసినవి
అన్నం – అరకిలో మెత్తగా వండిన అన్నం
సొరకాయ తురుము : పెద్దకాయలో పావుముక్క
జీలకర్ర – టీ స్పూను
పచ్చిమిర్చి : పది
అల్లం : కొద్దిగా
కరివేపాకు – చిన్న కట్ట (సన్నగా తరగాలి)
ఉప్పు – తగినంత
ముందుగా బియ్యాన్ని ఒక గంటసేపు నానబెట్టుకొని కొద్దిగా మెత్తగా అన్నం వండుకోవాలి. పచ్చిమిర్చి, అల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో అన్నం , సొరకాయ గుజ్జు, జీలకర్ర, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి అల్లం మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలపిన తరువాత ప్లాస్టిక్ పేపర్ మీద గాని నూలు చీర మీద గాని వడియాలు పెట్టుకోవాలి. రెండు మూడు రోజులు పూర్తిగా ఎండనిచ్చి గాలి చోరని డబ్బాలో నిలవ చేసుకోవాలి