కావలిసినవి
బూడిద గుమ్మడికాయ : చిన్నది 1
మినపపప్పు లేక గుండ్లు : ఒక కేజి
పచ్చమిర్చి : 10 కాయలు
జీలక్రర : 2 టీస్పూన్లు
అల్లం : కొద్దిగా
ఉప్పు తగినంత
తయారీ పద్దతి :
ముందుగా మినపగుండ్లను కానీ, లేక పప్పును గానీ ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి (సుమారు 8 గంటలు). అదే సమయంలో బూడిద గుమ్మడి కాయను పైన చెక్కుతీసి ముక్కలుగా కోసుకొని సన్నగా తురుముకోవాలి. ఈ తురుమును ఒక పలచటి బట్టలో మూటకట్టి వెడల్పాటి పళ్లెంలో ఉంచి దానిమీద ఏదైనా బరువును పెట్టాలి. దీని వల్ల గుమ్మడి తురుములో ఉన్న నీరుఅంతా కిందకు దిగిపోతుంది.
ఉదయాన్నే నానిన మినపగుండ్లను వడకట్టి అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయించుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి. జావగా ఉండకూడదు. తరువాత ఈ పిండిలో వడకట్టిన గుమ్మడి తురుమును వేసి బాగా కలిసేటట్లు తిప్పుకోవాలి. అవసరమైతే గుమ్మడి తురుము నుంచి వడకట్టిన నీరు కొద్దిగా కలుపుకోవచ్చు.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తడిపిన నూలు బట్టమీద చిన్న చిన్న చిన్న వడియాలు లాగా పెట్టుకోవాలి. ఎండలో బాగా ఎండిన తరువాత వీటిని బట్టనుండి వేరుచేసి గాలిచోరని డబ్బాలో నిలవ ఉంచుకోవాలి. ఇవి మరీ ఎక్కువ కాలం నిలవ ఉంచితే పురుగు పట్టే అవకాశం ఉంది కనుక రెండు లేక మూడు నెలలో వాడివేయటం మంచిది. . ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.