header

Jowar Vadiyalu….జొన్నపిండితో వడియాలు

కావలసినవి
జొన్నపిండి-ఒక కప్పు
మంచి నీళ్లు-ఐదు కప్పులు
కారం- అర టీస్పూను
ఉప్పు-సరిపడా
ఇంగువ-చిటికెడు
తయారు చేసే విధానం
రెండు కప్పుల వేడి నీళ్లలో జొన్నపిండి కలిపి పలచగా చేయాలి. మిగిలిన నీటిని మరిగించాలి. మరిగిన నీళ్లల్లో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఉండలు కట్టకుండా కలపి అందులో అందులో ఉప్పు, కారం వేయాలి..ఉడికిన తర్వాత ఇంగువ కూడా కలపాలి. చల్లారాక ఒక ప్లాస్టిక్‌ షీటుపై లేక తెల్లని నూలు వస్త్రం తడిపి, పిండి దానిపై స్పూనుతో పిండిని కొంచెం తీసుకుని గుండ్రంగా వడియాలు పెట్టాలి.వడియాలు ఎండిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి.