header

Methi Vadiyalu

మెంతికూరతో వడియాలు
కావలసినవి
మినప్పప్పు- రెండు కప్పులు
మెంతి ఆకులు- ఎనిమిది కప్పులు
జీలకర్ర- రెండుచెంచాలు
ఉప్పు- రెండు చెంచాలు
పచ్చిమిర్చి- పన్నెండు కాయలు మొత్తగా రుబ్బుకోవాలి
అల్లం తరుగు- నాలుగు చెంచాలు.
తయారు చేసే విధానం
ముందు రోజు రాత్రి మినప్పప్పును నానబెట్టుకోవాలి. మర్నాడు కడిగి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. కాసేపయ్యాక పల్చని తడి వస్త్రం మీద బిళ్లల మాదిరి పెట్టుకోవాలి. బాగా ఎండే వరకూ ఉంచితే పురుగు పట్టకుండా ఉంటాయివి.