header

Minapa Vadiyalu

మినప వడియాలు
కావలిసినవి
మినపగుండ్లు లేక మినపపప్పు : 1 కేజి
పచ్చిమిర్చి : 10 కాయలు
జీలకర్ర : 3 చెంచాలు
ఉప్పు : తగినంత
తయారు చేసే పద్దతి
ముందు మినపగుండ్లు లేన పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి (సుమారు 8 గంటలసేపు). మరుసటి రోజు తెల్లవారు ఝామున నానిన మినపగుండ్లను నీరు లేకుండా వడకట్టి అందులో పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మొత్తగా గ్రైండ్ చేయించాలి. పిండి మరీ పలచగా గానీ మరీ గట్టిగా కానీ ఉండకూడదు.
ఇప్పుడు ఈ పిండిలో జీలకర్ర కలిపి తడిపిన నూలు గుడ్డమీద చిన్న చిన్న వడియాలు లాగా పెట్టుకోవాలి. వీటిని ఎండలో పూర్తిగా ఎండనిచ్చి గాలిచోరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి . ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.