header

Ravva Vadiyalu /రవ్వ వడియాలు

బొంబాయి రవ్వ వడియాలు
కావలిసినవి
బొంబాయి రవ్వ : అరకిలో
సగ్గుబియ్యం : 4 టేబుల్ స్పూన్లు
బియ్యపు పిండి : 50 గ్రాములు
పచ్చమిర్చి : 10 కాయలు
జీలకర్ర : 2 1 స్పూను
అల్లం : కొద్దిగా
ఉప్పు : తగినంత
తయారీ పద్దతి
ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కలిపి మొత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ వెలిగించి వెడల్పాటి పాత్రలో రెండు లీటర్ల నీటిని పోసి మరిగించాలి. పచ్చిమిర్చి ముద్ద, సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. తరువాత బొంబాయి రవ్వను, బియ్యపు పిండిని కొంచెం, కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా కలియ తిప్పాలి.
దీనిలో సరిపడా ఉప్పు వేయాలి. జీలకర్రకూడా వేసి ఈ మిశ్రమం కాస్త చిక్కబడ్డాక దించుకొని కొద్దిగా వేడిగానే ఉండగానే తడిపిన నూలు బట్టమీద చిన్న చిన్న వడియాలులాగా పెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తరువాత గాలి చోరని డబ్బాలో ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.