కావలిసినవి
టమాటోలు : 1 కిలో.
సగ్గుబియ్యం : 1 కప్పు
అటుకులు : 1 కప్పు
పచ్చిమిరపకాయలు : 10
జీలకర్ర : 3 చెంచాలు
ఉప్పు : తగినంత
తయారు చేసే పద్ధతి
ముందుగా టమాటోలు చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత సగ్గుబియ్యం, టామాటోలు అటుకులు అన్నీ కలిపి అరగంటసేపు నానబెట్టుకోవాలి. పచ్చి మిర్చిలో ఉప్పువేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నానవేసిన అటుకులు, టమాటాలు, తగినంత ఉప్పు వేసి మరొక సారి గ్రైండ్ చేయాలి మరీ పలచగా ఉండకూడదు. ఈ మిశ్రమంలో జీలకర్ర వేసి చిన్న చిన్న వడియాలు లాగా పెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తరువాత గాలి చోరని డబ్బాలో ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.