header

Alu…Batani Curry….బఠానీ..బంగాళాదుంపల కూర

Alu…Batani Curry….బఠానీ..బంగాళాదుంపల కూర

కావలసినవి
బంగాళదుంపలు - రెండు
పచ్చి బఠాణీలు- కప్పు
ఉల్లిపాయ - రెండు పాయలు
టమాటాలు- రెండు
పచ్చిమిర్చి-నాలుగు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
కారం- చెంచా
పసుపు – పావు స్పూన్
ఉప్పు – తగినంత
కొత్తీమీర : కొద్దిగా
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
తయారు చేసే పద్ధతి
ముందుగా పచ్చి బటానీలను ఉడకబెట్టాలి. పచ్చి బటానీలు దొరకకపోతే ఎండు బటానీలను ఒక రాత్రాంతా నానబెట్టుకొని ఉడక బెట్టకోవాలి. ఉల్లిపాలయలను, పచ్చిమిరపకాయలను సన్నగా తరుగుకోవాలి.
తరువాత ఒక కడాయిలో నూనె వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బంగాళదుంపలను చెక్కుతీసి చిన్నముక్కలుగా కోసి.. ఉల్లిపాయల్లో వేసి వేయించాలి. పసుపు, కారం, ఉప్పు, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉడికిన తర్వాత పచ్చి బఠాణీలు వేసి, తగినంత ఉప్పు కలిపి అవసరమైతే కొద్దిగా నీరుపోసి మూతపెట్టేయాలి. ఉడికిన తర్వాత దించుకునే ముందు కొత్తిమీర తురుము చల్లుకోవాలి. ఈ కూర చపాతీలలోకి మంచి కాంబినేషన్