

మెంతి కూర: 6 కట్టలు(చిన్నవి) 
 బంగాళాదుంపలు: పావుకిలో 
 మెంతులు: టీస్పూను 
 కారం: టీస్పూను 
దనియాలపొడి: 2 టీస్పూన్లు 
ఏదైనా నూనె: అర కప్పు  
బంగాళాదుంపలు శుభ్రంగా కడిగి  విడిగా ఉడికించుకుని తొక్కతీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి 
 బాణలిలో మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరవాత సన్నగా తరిగిన మెంతికూర వేసి వేయించాలి. అది కాస్త వేగి ఉడికిన తరవాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, కారం, దనియాలపొడి వేసి మూతపెట్టి పూర్తిగా ఉడికేవరకూ ఉంచి దించాలి.
  ఈ కూరవేడిగా అన్నంలోకి గానీ, చపాతీలలోకి కానీ బాగుంటుంది.