సొరకాయ: అరకిలో
నూనె : 2 టేబుల్స్పూన్లు
ఉల్లిపాయలు: రెండు
పచ్చి మిరపకాయలు : మూడు
కారం : 1 స్పూను
పెరుగు: కప్పు
జీలకర్ర : 1 టీస్పూను
దనియాలపొడి: టీస్పూను
కరివేపాకు : 4 రెబ్బలు
పసుపు : అర స్పూను
ఉప్పు: రుచికి సరిపడా
బాణలిలో టేబుల్స్పూను నూనె వేసి సొరకాయ ముక్కల్ని వేసి మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి.
మరో బాణలిలో మిగిలిన నూనె వేసి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. తరవాత మృదువుగా గిలకొట్టిన పెరుగు వేసి మరిగించాలి. ఇప్పుడు జీలకర్ర, దనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత డికించిన సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మరికాసేపు సిమ్లో ఉడికించి, కొత్తిమీర తురుము చల్లుకొని దించుకోవాలి