వంకాయలు: పావుకిలో
పచ్చి బఠాణీలు: 50 గ్రాములు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం: అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
దనియాలపొడి: 1 టేబుల్‌స్పూన్లు
కారం: టీస్పూను
ఉప్పు: తగినంత
కొత్తిమీర తురుము: కొద్దిగా
కొబ్బరి తురుము: టేబుల్ స్పూను
తాలింపుకోసం: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు
పసుపు : అర చెంచా
ముందు రోజు రాత్రి ఎండు బఠానీలను నాన బెట్టుకొని వంకాయ కూర చేసే ముందు ఉడికించుకోవాలి. పచ్చివయితే నేరుగావేయవచ్చు అల్లం,వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దలా చేయాలి... బాణలిలో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగాక అల్లం, వెల్లుల్లివేయాలి. తరవాత పచ్చిమిర్చి ముద్ద, బఠాణీలు వేసి రెండు నిమిషాలు వేయించాక కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత వంకాయ ముక్కలుగా కోసి ఇందులో వేసి మూతపెట్టిఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. చివరగా దనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరితురుము, కొత్తిమీర తురుమువేసి ఉడికించి దించుకోవాలి.