లేత వంకాయలు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చి మిరపకాయలు : మూడు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పచ్చి కొబ్బరి తురుము: 2 స్పూన్లు
పసుపు : పావుస్పూన్
ఉప్పు : తగినంత
తిరగమాత గింజలు : 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : 2 కాయలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
ముందుగా వంకాయలను ఉప్పువేసిన నీటిలో శుభ్రంగా కడుగు కోవాలి. వంకాయలను కోసిన వెంటనే కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో వేయాలి లేకపోతే ఇవి కండ్రు ఎక్కి చేదుగా మారుతాయి. వంకాయలను మధ్యలోకి కోసి వాటిని తిరిగి నిలువుగా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా చిన్నవిగా తరుగుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చిని రెండుగా తుంచి వేయాలి. అవి కొంచెం వేగాక తిరగమాత గింజలు వేసి అవి కూడా వేగాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, రెబ్బలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. తరువాత అందులో వంకాయ ముక్కలు వేసి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి సన్నని సెగమీద చక్కగా వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము, ఉఫ్పు వేసి చక్కగా కలిపి ఇంకొద్ది సేపు వేగనిచ్చి దింపుకోవాలి