గోరుచిక్కుడుకాయలు: పావుకిలో
తెల్లనువ్వులపొడి: నాలుగు స్పూన్లు
ఎండుకొబ్బరితురుము: 3 టీస్పూన్లు
కారం: టీస్పూను
కొత్తిమీర తురుము: కొద్దిగా
పచ్చిమిర్చి: నాలుగు
అల్లంవెల్లుల్లి: టీస్పూను
మినప్పప్పు: టీస్పూను
ఎండుమిర్చి: నాలుగు
ఆవాలు: టీస్పూను
జీలకర్ర: అరటీస్పూను
కరివేపాకు: 4 రెబ్బలు
పసుపు: చిటికెడు
ఉప్పు: తగినంత
నూనె: 2 టీస్పూన్లు
ముందుగా గోరుచిక్కుడు కాయలను పసుపు వేసి ఉడికించి వాటి ఈనెలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి.
పాన్లో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
తరవాత గోరుచిక్కుడుకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, వేసి కలపాలి. తరువాత నువ్వులపొడి,. ఎండుకొబ్బరి తురుము, కొత్తిమీర తురుము వేసి కలిపి రెండు నిమిషాల తరువాత దించుకోవాలి.