గింజలు- పదిహేను
ఉల్లిపాయ- పెద్దది ఒకటి
టొమాటో- రెండు
అల్లం, వెల్లుల్లిపేస్ట్- చెంచా
కారం- చెంచా
పోపు గింజలు – 1 స్పూను
ధనియాలపొడి- చెంచా
జీలకర్ర పొడి- చెంచా
గరంమసాలా- అరచెంచా
పసుపు- కొద్దిగా
నూనె- చెంచా
ఉప్పు – సరిపడ
కరివేపాకు – 4 రెబ్బలు
ముందుగా పనస గింజలని కుక్కర్‌లో ఉడికించి పైన పొర తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పోపుగింజలు, ఉల్లిపాయ ముక్కలు, వేసి దోరగా వేయించుకోవాలి. దీనిలో అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, బాగా వేగాక టొమాటోలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి జీలకర్రపొడి, గరంమసాలా, ధనియాల పొడి వేసుకుని కలియతిప్పుకోవాలి. దానిలో తరిగి పెట్టుకున్న పనస గింజలని కూడా వేసుకుని కలియతిప్పి, కారం, ఉప్పూ,పసుపు వేసి బాగా కలిపి ఉడికిన తర్వాత కొత్తిమీరతో అలంకరించుకుని వడ్డించుకుంటే సరిపోతుంది