కంద ముక్కలు – పావు కిలో
ఉల్లిపాయ : పెద్దది ఒకటి
పచ్చిమిర్చి - నాలుగు
చింతపండు గుజ్జు - రెండు టేబుల్ స్పూన్లు
పసుపు – అరచెంచా
ఉప్పు – తగినంత
ఆవాలు – ఒక స్పూన్
ఆవపిండి - టేబుల్స్పూను
పచ్చిసెనగపప్పు – చెంచా
మినపప్పు – అరచెంచా
ఎండుమిర్చి – నాలుగు
కరివేపాకు రెబ్బలు – నాలుగు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
కంద ముక్కలు శుభ్రం చేసుకొని చిన్నముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. తరువాత పొయ్యిపై పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలూ, సెనగపప్పూ, మినప్పప్పూ, (తెలుగువారు తిరగమాత గింజలు అంటారు) ఎండుమిర్చీ, కరివేపాకూ, తరిగిన ఉల్లిసాయ, పచ్చిమిర్చి వేయాలి. అన్నీ వేగాక ఉడికించిన కంద ముక్కలూ, పసుపూ, చింతపండు గుజ్జూ, తగినంత ఉప్పు,పసుపు వేసి మంట తగ్గించాలి. ఈ మొత్తం ఉడికిన తరువాత ,. ఆవపిండి వేసి కొద్దసేపు ఉడికించి దించుకోవాలి