కావలసినవి
కంద : అరకిలో
కొబ్బరి తురుము 4 టీస్పూన్లు
కారం : 2 టీస్పూన్లు
బెల్లం తురుము : 2 టీ స్పూన్లు
చింతపండు : చిన్న నిమ్మకాయంత
పసుపు : అరస్పూను
కరివేపాకు : 2 రెబ్బలు
ముందుగా చింతపండును నానబెట్టి రసం తీసుకుని ఉంచుకోవాలి.
కంద పొట్టుతీసి గోరువెచ్చని నీటిలో కడగాలి. చిన్నముక్కలుగా కోసి మరలా నీళ్లలో నాలుగైదు సార్లు కడగాలి.
వెడల్పాటి పాత్ర లేక పాన్ లో నూనె వేసి వెడెక్కిన తరువాత తాలింపు దినుసులు వేసి దోరగా వేగిన తరువాత కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత కందముక్కలను వేసి 2 నిమిషాల సేపు వేయించాలి. తరువాత చింతపండు రసం, పసుపు, ఉప్పు, కారం, బెల్లం తురుము వేసి ఒక కప్పు నీరు పోసి మూతపెట్టి సిమ్ లో ఉడికించాలి. ఉడికిన తరువాత దింపి కొబ్బరి తురుము కలపాలి. దీనిని కూరలాగా తినవచ్చు. లేదా నీరు మొత్తం ఆవిరి అయ్యేదాకా ఉంచి పొడికూరలాగా తినవచ్చు.