నాణ్యమైన బెండకాయలు చిన్నవిగా ఉండి నూగుతో లోపల సన్నగింజలతో ఉంటుంది. చివరిభాగం తుంచితో తేలికగా విరిగిపోతుంది.
హైబ్రీడ్ బెండకాయలు లావుగా, పెద్దవిగా, పెద్ద గింజలతో ఉంటాయి. ఇవి పెద్ద రుచిగా ఉండవు.
లేత బెండకాయలు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చి మిరపకాయలు : మూడు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పచ్చి కొబ్బరి తురుము: 2 స్పూన్లు
పసుపు : పావు స్పూన్
ఉప్పు : తగినంత
తిరగమాత గింజలు : 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : 2 కాయలు
చిన్నుల్లిపాయలు : 4 రెబ్బలు
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా చేస్తే బెండకాయలో జిగురు పెద్దగా ఉండదు. బెండకాయలు తడిలేకుండా పూర్తిగా ఆరినతరువాత చిన్నవిగా గుండ్రంగా కోయాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా చిన్నవిగా తరుగుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చిని రెండుగా తుంచి వేయాలి. అవి కొంచెం వేగాక తిరగమాత గింజలు వేసి అవి కూడా వేగాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, నలగగొట్టిన చిన్నుల్లి రెబ్బలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. తరువాత అందులో సన్నగా తరిగిన బెండకాయముక్కలు వేసి, కొద్దిగా పసుపు కూడా వేసి సన్నని సెగమీద చక్కగా వేగనివ్వాలి. తరువాత ఉఫ్పు వేసి చక్కగా కలిపి ఇంకొద్ది సేపు వేగనిచ్చి దింపుకోవాలి