మీల్ మేకర్ లేదా సోయా నగ్గెట్స్...1 కప్పు
ఉల్లిపాయ పెద్దది...ఒకటి
టమాటో... పెద్దది ఒకటి
కేరెట్, బంగాళా దుంప, బీన్స్...ఒక కప్పు
పచ్చి మిర్చి .. రెండు సన్నగా కోయాలి
అల్లం, వెల్లుల్లి పేస్ట...ఒక స్పూన్
ఉప్పు, కారం....తగినంత..
పసుపు...పావు స్పూన్
ధనియాల పొడి...రెండు స్పూన్లు
కొబ్బరి తురుము...పావు కప్పు
వేయించిన జీడిపప్పు...నాలుగు
పుట్నాల పప్పు..2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క...అంగుళం ముక్క
లవంగాలు...రెండు
పలావ్ ఆకు...1
కరివేపాకు...4 రెబ్బలు
కొత్తిమీర తరుగు...2 స్పూన్లు
ఉప్పు వేసి మరిగించిన నీటిలో మీల్ మేకర్ వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి. నీటిని వంపి వేసి, ఉబ్బిన మీల్ మేకర్ లోని నీటిని పిండి వేయండి. ఒక్కోమీల్ మేకర్ రెండుగా చేయండి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, పుట్నాలు, జీడిపప్పు, ధనియాలు, సోంపు, అన్నీ కలిపి మీక్సీలో మెత్తగా చేసుకొని ఉంచుకోవాలి.
పాన్ లో నూనె వేసి వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, పలావు ఆకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక నిమిషం తరువాత తమాటో ముక్కలు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి కూరగాయల తరుగు వేసి 10 నిమిషాలు ఉడికిన తరువాత మీల్ మేకర్ కూడా వేసి 15 నిమిషాకా ఉడకనివ్వాలి. ఇపన్పడు కొబ్బరి మిశ్రమం, గరం మసాలాతో పాటు రెండున్న కప్పుల నీరు పోసి సన్న సెగపై కూర్మ చిక్కబడేదాకా ఉంచి, కొత్తిమీర తరుగు చల్లి దించుకోవాలి.
చపాతీలలోకి గానీ వేడి అన్నంలోకి గానీ బాగుంటుంది