header

Mealmaker Parata…మీల్ మేకర్ పరాటా...

Mealmaker Parata…మీల్ మేకర్ పరాటా...

కావలసినవి
గోధుమపిండి – 2 కప్పులు
బంగాళా దుంపలు – రెండు (మెత్తగా ఉడికించుకోవాలి)
మీల్ మేకర్ – అరకప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – పావు టేబుల్ స్పూన్
జీలకర్ర, సోంపు, కారం, ఛాట్ మసాలాలు – అర టేబుల్ స్పూన్
ఆవాలు – చిన్న స్పూన్
ఉప్పు – తగినంత
తయారుచేసే విధానం
ముందుగా మీల్ మేకర్ ను అరగంటసేపు వేడి నీటిలో నానబెట్టి, మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి.
తరువాత వెడల్పాటి పాన్ లో నూనెవేసి ఆవాలు, జీలకర్ర, సోంపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి. తర్వాత ఉడింకించి మెత్తగా చేసిన బంగాళా దుంపలు, మీల్ మేకర్ ముద్ద, పసుపు, కారం, చాట్ మసాలా, ఉప్పు కలిపి రెండునిమిషాలు మగ్గనిచ్చి దింపుకోవాలి..
గోధుమ పిండిలో తగినంత .ఉప్పు నీరు పోసి స్పూను నూనె వేసి కలుపుకొని చపాతీలు చేసుకోవాలి. ఈ చపాతీ మధ్యభాగంలో మీల్ మేకర్ ముద్దను కొద్దిగా పెట్టి అంచులు మడచి తిరిగి చపాతీలాగా ఒత్తుకోవాలి. తరువాత వేడెక్కిన పెనం మీద నూనె లేదా నెయ్యితో రెండువైపులా చక్కగా కాలనివ్వాలి. ఆనియన్ రైతాతో కానీ ఏదైనా కూరతో కాని తినవచ్చు.