మెంతికూర – రెండు పెద్ద కట్టలు
పెసరపప్పు – 75 గ్రాములు
నూనె : 1 టీ స్సూను
ఉల్లిపాయ పెద్దది - ఒకటి
పచ్చి మిర్చి – 4 కాయలు
వెల్లుల్లి - 4 రెబ్బలు
జీలకర్ర – టీస్పూను
పసుపు – కొద్దిగా
ఉప్పు – కొద్దిగా
పెసరపప్పును అరగంట సేపు నీటిలో నానబెట్టుకొని కొద్దిగా నీరుపోసి ఉడికించుకొని నీరు ఒంపేసి ఉంచుకోవాలి. మెంతికూరను ఈనెలు తీసివేసి ఆకులను తుంచుకోవాలి. పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి.
పాన్ లో నూనె వేసి వేడెక్కిన తరువాత నూనె, జీలకర్రవేసి వేగాక నలగగొట్టిన వెల్లుల్లి, సన్నగా తరిగిన మిర్చి, తరిగిన ఉల్లిపాయ వేసి వేయించాలి. తరువాత మెంతికూర ఆకు, ఉడకబెట్టిన పెసరపప్పు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి సిమ్ లో ఉడికించి దించుకోవాలి.