header

Pototo Fry…బంగాళదుంపల ఫ్రై

Pototo Fry…బంగాళదుంపల ఫ్రై

కావలసినవి
ముందుగా నాణ్యమైన దుంపలను తీసుకోవాలి. దుంపల మీద ఆకుపచ్చ రంగు మచ్చలు కానీ, మొలకలు కానీ ఉండకూడదు.
బంగాళా దుంపలు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చి మిరపకాయలు : మూడు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావుస్పూన్
ఉప్పు : తగినంత
తిరగమాత గింజలు : 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : 2 కాయలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
తయారుచేసే విధానం
ముందుగా బంగాళా దుంపలను తగినంత నీరు పోసి కొద్దిగా ఉప్పువేసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత నీరు వంపివేసి చల్లటి నీళ్లలో దుంపలను వేయాలి. ఆరిన తరువాత పైన తోలు తొలగించాలి. దుంపలను కావలిసిన సైజులో కోసుకోవాలి ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా చిన్నవిగా తరుగుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చిని రెండుగా తుంచి వేయాలి. అవి కొంచెం వేగాక తిరగమాత గింజలు వేసి అవి కూడా వేగాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, రెబ్బలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. తరువాత అందులో బంగాళా దుంపల ముక్కలు వేసి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి సన్నని సెగమీద చక్కగా వేగనివ్వాలి. తరువాత ఉఫ్పు వేసి చక్కగా కలిపి ఇంకొద్ది సేపు వేగనిచ్చి దింపుకోవాలి