గుమ్మడికాయ ముక్కలు – సుమారు పావు కిలో
నూనె- టేబుల్ స్పూను
ఉల్లిపాయ – 1 పెద్దది
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
సన్నగా తరిగిన అల్లం - టేబుల్ స్పూను
జీలకర్ర - రెండు చెంచాలు
ధనియాలు - టేబుల్‌స్పూను
దాల్చిన చెక్క- చిన్నముక్క
టొమాటోలు - రెండు
నానబెట్టి, ఉడికించిన సెనగలు - రెండు కప్పులు
ఉప్పు - తగినంత
పొయ్యిపై బాణలి పెట్టి, నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
తరువాత అల్లం, వెల్లుల్లీ, జీలకర్రా, ధనియాలూ, దాల్చిన చెక్క వేసి రెండు నిమిషాలు వేయించాలి. గుమ్మడికాయా, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి అవన్నీ ఉడుకుతాయి. అప్పుడు ఉడికించిన సెనగలూ, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కూరలా తయారయ్యాక దింపేయాలి.