header

Pumpkin Curry..గుమ్మడికాయ...పాలకూరతో "

Pumpkin Curry..గుమ్మడి...పాలకూరతో

కావలసినవి
గుమ్మడికాయ ముక్కలు – 200 గ్రాములు
నూనె- రెండు టేబుల్‌స్పూన్లు ఆవాలు - అర చెంచా
పచ్చిమిర్చి- మూడు
కరివేపాకు - రెండు రెబ్బలు
పసుపు - చెంచా
మెంతులు - పావు చెంచా
ఉల్లిపాయలు - రెండు
టొమాటోలు - నాలుగు
కొబ్బరి పాలు - అర కప్పు
పాల కూర - కట్ట
నిమ్మరసం - టేబుల్‌ స్పూను
పుదీనా ఆకులు - టేబుల్‌ స్పూను
పెరుగు - కప్పు
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం
పొయ్యిపై బాణలి పెట్టి, వేడెక్కిన తరువాత నూనె వేసి ఆవాలు వేయాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలూ, కరివేపాకూ, పసుపూ, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.తరువాత టొమాటోముక్కలు వేయాలి. అవి కాస్త వేగినతరువాత కొబ్బరి పాలూ, గుమ్మడికాయ ముక్కలు వేసి మూత పెట్టేయాలి. అవి ఉడికాక సన్నగా తరిగిన పాలకూరా, నిమ్మరసం కలపాలి. పాలకూర కూడా ఉడికాక సరిపడా ఉప్పూ, పుదీనా ఆకులు వేసి దింపుకోవాలి