కందిపప్పు – 50 గ్రాములు
గుమ్మడికాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు
పసుపు- పావుచెంచా
కారం - చెంచా
ఉప్పు- తగినంత
కరివేపాకు - మూడు రెబ్బలు
నూనె- రెండు చెంచాలు
ఆవాలు - పావు చెంచా
ఎండుమిర్చి - మూడు
జీలకర్ర - అర చెంచా
కొబ్బరి తురుము- కప్పు
మిరియాలు 1 స్పూను
ధనియాలు – 1 టేబుల్ స్పూను
ముందుగా కందిపప్పులో , రెండు కప్పుల నీళ్లూ, కారం, ఉప్పూ, పసుపు కలిపి మెత్తగా ఉడికించుకోవాలి.
కొబ్బరి తురుమూ, జీలకర్రా, ధనియాలూ, మిరియాలను మిక్సీలో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. పప్పులో గుమ్మడికాయ ముక్కలను వేసి మరో కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. గుమ్మడికాయ ముక్కలూ, పప్పు పూర్తిగా ఉడికాక కొబ్బరిముద్ద వేయాలి. ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక తిరగమాత గింజలు, ఎండుమిర్చీ, కరివేపాకు వేయించి అందులో ఈ పప్పు వేయాలి