header

Pumpkin Masala Curry / గుమ్మడి మసాలా కూర...


Pumpkin Masala Curry / గుమ్మడి మసాలా కూర...

కావలసినవి
గుమ్మడికాయ ముక్కలు - అరకేజీ
ఆవాలు - చెంచా
నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
మినప్పప్పు - పావు టేబుల్‌ స్పూను
జీలకర్ర - అర చెంచా
జీడిపప్పు - అయిదు
ఉల్లిపాయ - ఒకటి
పసువు- పావు చెంచా
అల్లం వెల్లుల్లి ముద్ద - అర చెంచా
కారం - టేబుల్‌ స్పూను
ధనియాల పొడి - అర చెంచా
సెనగపిండి - టేబుల్‌ స్పూను
కొత్తిమీర తరుగు - టేబుల్‌ స్పూను
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం
పొయ్యిపై బాణలి పెట్టి, వేడెక్కిన తరవాత నూనె వేసి, అందులో ఆవాలు, మినప్పప్పూ, జీలకర్ర వేయించి తరవాత జీడిపప్పూ, ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగాక పసుపూ, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాల తరువాత గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరువాత కారం, ధనియాలపొడీ, తగినంత ఉప్పూ, కాసిని నీళ్లూ పోసి మూత పెట్టేయాలి. మరో పొయ్యిమీద బాణలి పెట్టి అరచెంచా నూనె వేసి సెనగపిండి వేయాలి. చిన్నమంటపై పచ్చివాసన పోయేవరకూ వేయించుకుని తీసుకోవాలి. దీన్ని గుమ్మడికాయ కూరలో వేసి ఉండలు కట్టకుండా కలిపి... కూరలా అయ్యాక దింపేసి కొత్తిమీర వేయాలి. ఇది అన్నంలోకే కాదు.. చపాతీల్లోకీ బాగుంటుంది.