క్యాప్సికమ్: 3 పెద్దవి
పల్లీలు: పావుకప్పు
తెల్లనువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు
జీలకర్ర: 2 టీస్పూన్లు
చింతపండు:నిమ్మకాయంత
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు:టీస్పూను
కారం: టీస్పూను
దనియాలపొడి: టీస్పూను
జీలకర్ర పొడి: టీస్పూను
ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: 3, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి: 4 రెబ్బలు, కొబ్బరి: 2 టేబుల్‌స్పూన్లు
ఆవాలు: టీస్పూను, మెంతులు: అరటీస్పూను, ఉల్లిగింజలు: టీస్పూను, నూనె: టేబుల్‌స్పూను
చింతపండుని గోరువెచ్చని నీళ్లలో పావుగంట నానబెట్టి గుజ్జులా చేయాలి. బాణలిలో పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేయించి పొడి చేయాలి. తరవాత గ్రేవీకోసం తీసుకున్నవన్నీ నీళ్లు లేకుండా మెత్తగా రుబ్బాలి.బాణలిలో టీస్పూను నూనె వేసి క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి నాలుగైదు నిమిషాలు వేయించి పక్కన ఉంచాలి.
మరో బాణలిలో నూనె వేసి తాలింపు చేసి, రుబ్బిన మసాలా ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. గ్రేవీ చిక్కబడ్డాక పల్లీల పొడి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్రపొడి, దనియాలపొడి, చింతపండుగుజ్జు వేసి కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరవాత వేయించిన క్యాప్సికమ్ ముక్కలు వేసి చిక్కబడేవరకూ ఉడికించి దించాలి.
ఈ కూరవేడిగా అన్నంలోకి గానీ, చపాతీలలోకి కానీ బాగుంటుంది.