పొట్లకాయ – 1
ఉల్లిపాయలు – 3
అల్లం – 2 అంగుళాల ముక్క
వెల్లుల్లి – 10 రెబ్బలు
జీలకర్ర – 1 టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
మిరియాలు – అర టీ స్పూన్
చీజ్ – 4 టీ స్పూన్స్
పసుపు – కొంచెం
కారం – 1 టీ స్పూన్
గరం మసాలా – 1 టీ స్పూన్
చింతపండు గుజ్జు – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడ
నూనె 4 టీ స్పూన్లు
పొట్లకాయ పైపొట్టును స్పూన్తో తీసి కడగాలి. తరువాత పొట్లకాయను అంగుళంన్నర గుండ్రని గొట్టాలలాగా కోయాలి. మధ్యలో ఉన్న గింజలు కూడా తొలగించాలి.
ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి కొంచెం మొత్తగా మిక్సీ పట్టుకోవాలి
స్టౌ పైన బాణలి పెట్టి 2 స్ఫూన్లు నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయాలి ∙తర్వాత చేసుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద, పొట్లకాయను గింజలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి చింతపండు గుజ్జు, గరం మసాలా, ఛీజ్ కూడా వేసి మరి కాసేపు వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఆ మిశ్రమాన్ని పొట్లకాయ ముక్కలలో కూరుకోవాలి
పాన్ లో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక స్టఫింగ్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేగనివ్వాలి ∙చిన్న మంట మీద 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. తర్వాత నెమ్మదిగా అన్ని వైపులా కాలేలా స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. పూర్తిగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి