సోయా చంక్స్(మీల్ మేకర్) : పావుకిలో
పాలకూర: నాలుగు కట్టలు
పచ్చిమిర్చి: ఆరు
వెల్లుల్లి: నాలుగు రెబ్బలు
ఉల్లిపాయ: ఒకటి
ఉప్పు: తగినంత
జీలకర్ర:టీస్పూను
దనియాలపొడి: టీస్పూను
కారం : స్పూను
నీళ్లు: తగినన్ని
జీలకర్రపొడి: టీస్పూను
పసుపు: అరటీస్పూను
నిమ్మరసం: అరటీస్పూను
ఇంగువ : చిటికెడు
టొమాటోలు: 3
పసుపు : అరస్పూను
నూనె: 2 టేబుల్‌స్పూన్లు
సోయా చంక్స్ వేడినీళ్లలో వేసి పది నిమిషాలు ఉంచి తీసి నీటిని పిండివేసి ఒక్కో దానిని రెండు లేక నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ప్రెషర్ పాన్‌లో నూనె వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి తరువాత వెల్లుల్లి ముక్కలు, సోయా చంక్స్ వేసి కాసేపు వేయించాలి. దనియాలపొడి, సన్నగా తరిగిన టొమాటాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, తురిమిన పాలకూర, ఉప్పు వేసి కలపాలి. తరవాత సుమారు ఓ గ్లాసు నీళ్లు పోసి కలిపి సిమ్ లో ఉడికించుకొని దించుకోవాలి. ఇది చపాతీలోకి గానీ వేడి అన్నంలోకి గానీ బాగుంటుంది.