పాలకూర: ఐదు కట్టలు
కొబ్బరి తురుము: కప్పు
పసుపు: అరటీస్పూను
జీలకర్ర : స్పూను
పచ్చిమిర్చి: నాలుగు
ఎండుమిర్చి: రెండు
వెల్లుల్లిరెబ్బలు: నాలుగు
ఉల్లిపాయ: ఒకటి
కరివేపాకు: 4 రెబ్బలు
ఉప్పు: తగినంత
ఆవాలు: అరటీస్పూను
నూనె: తగినంత
శుభ్రంగా పాలకూరను గోరు వెచ్చని వేడి ఉప్పు నీటిలో రెండు నిమిషాలు ఉంచి కడిగి సన్నగా తరగాలి. ఉల్లి పాయను సన్నగా తరగాలి. కొబ్బరి తురుములో వెల్లుల్లి, పసుపు, జీలకర్ర పొడి, వెల్లుల్లి, రెండు రెబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
బాణలిలో నూనె వేసి ఆవాలు వేసి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కూడా వేసి వేయించాలి. తరవాత సన్నగా తరిగిన పాలకూర, గ్రైండ్ చేసిన మిశ్రమం, పసుపు, ఉప్పు వేసి బాగా ఉడకనిచ్చి దించుకోవాలి
ి.