కావలసినవి
చింతపండు –పెద్ద నిమ్మకాయంత
ఉల్లి తరుగు – పావు కప్పు
పచ్చి మిర్చి – 3
కొత్తిమీర – చిన్న కట్ట
బెల్లం – గొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
పోపు కోసం
ఆవాలు – టీ స్పూను
జీలకర్ర – టీ స్పూను
కరివేపాకు – 4 రెబ్బలు
ఇంగువ – చిటికెడు
ఎండుమిర్చి – 2
వెల్లుల్లి రెబ్బలు – 4
నూనె – 1 స్పూను
ఈ పచ్చిపులుసు సంప్రదాయంగా మన పూర్వీకుల నుండి వచ్చిందే. ముందుగా చింతపండును వేడినీళ్లలో నానబెట్టుకొని పిండుకొని రసం తీయాలి. దీంట్లో రెండు గ్లాసులు నీళ్లు కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా బెల్లం,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి స్టౌ మీద పాత్ర ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, నలగకొట్టిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు చేసి బాగా వేగిన తరువాత తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చిపులుసులో వేసి కలపాలి అన్నంలోకి రుచిగా ఉంటుంది. (ఉప్పు, తీపి. పులుపు తగ్గినట్టుగా అనిపిస్తే, మరి కొంత కలుపుకోవచ్చు)