దొండకాయలు: అరకిలో
పెసరపప్పు: అరకప్పు
మినప్పప్పు: 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి: నాలుగు
కొబ్బరి తురుము: 3 టేబుల్స్పూన్లు
మిరియాలు: నాలుగు
ఆవాలు: టీస్పూను
ఎండుమిర్చి: రెండు
కరివేపాకు: 2 రెమ్మలు
జీలకర్ర: టీస్పూను
పసుపు : అర స్పూను
నూనె: టేబుల్స్పూను
ఉప్పు : తగినంత
దొండకాయని చిన్న ముక్కలుగా కోయాలి. పెసరపప్పుని కూడా మరీ మెత్తగా కాకుండా ఉడికించి ఉంచాలి.
మినప్పప్పు, పచ్చిమిర్చి వేయించాలి. తరవాత వాటికి కొబ్బరి తురుము, మిరియాలు చేర్చి మెత్తని ముద్దలా రుబ్బాలి.
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దొండకాయ ముక్కలు, పెసరపప్పు వేసి కలపాలి. ఇప్పుడు రుబ్బిన కొబ్బరి మిశ్రమం, పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి సిమ్లో ఉడికించుకొని దించుకోవాలి