header

Karanda/Vakkaya Chutney…వాక్కాయ చట్నీ

Karanda/Vakkaya Chutney…వాక్కాయ చట్నీ

కావలసినవి వాక్కాయలు : 200 గ్రాములు
పచ్చికొబ్బరి ముక్కలు : కొద్దిగా
మెంతులు : 1 టీ స్పూన్
ఆవాలు : 2 టీస్పూన్
జీలకర్ర : 1 టీస్పూన్
పచ్చిమిర్చి : 10 కాయలు
నూనె : 2 స్పూన్లు
పసుపు : అరస్పూన్
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం
ముందుగా వాక్కాయలను శుభ్రం చేసుకొని నిలువుగా కోసి గింజలు తీసివేయాలి. తరువాత పొయ్యిమీద పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్ లో పచ్చిమిర్చి, వాక్కాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసి అన్నీ బాగా మగ్గిన తరువాత తీయాలి.ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి మొత్తగా దంచిన తరువాత వాక్కాయ, కొబ్బరిముక్కలు వేసి. సరిపడా ఉప్పు వేసి దంచుకోవాలి. లేక మిక్సీలో వేసుకోవచ్చు (రోట్లో దంచుకున్నది రుచిగా ఉంటుంది).