కందిపప్పు : చిన్న టీ గ్లాసులు 2
పచ్చిమిర్చి : 4
నూనె : 2 స్పూన్లు
పసుపు : అరస్పూను
తిరగమాత గింజలు : 1 స్పూను
ఎండుమిర్చి : 2
కరివేపాకు : కొద్దిగా
ఉప్పు : సరిపడా
ఉల్లిపాయ : ఒకటి
ముందుగా కందిపప్పును కనీసం అరగంటసేపు నానబెట్టుకోవాలి. తరువాత వాక్కాయలను శుభ్రం చేసుకోని నిలువుగా కోసి గింజలు తీసి వేయాలి. నానిన కందిపప్పు వెడల్పాటి పాత్రలో తీసుకొని తగినన్ని నీరు పోసి పొయ్యిమీద పెట్టి ఉడికించాలి. సగం ఉడికిన తరువాత పచ్చిమిర్చి, వాక్కాయ ముక్కలు, పసుపు,కొద్దిగా ఇంగువ వేసి పూర్తిగా ఉడికించుకోవాలి. తరువాత దింపుకొని పప్పు గుత్తితో మెత్తగా చేయాలి.
తరువాత ఒక పాన్ లో నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చి, తిరగమాత గింజలు వేసి కొద్దిగా వేగిన తరువాత సన్నగా తరిగి ఉల్లిపాయముక్కలు. కరివేపాకు వేసి అవి కూడా చక్కగా వేగిన తరువాత మెత్తగా చేసిన వాక్కాయ పప్పును వేసి రెండు నిమిషాలు ఉడికిన తరువాత దించుకోవాలి. కుక్కర్ లో వండేవారు కందిపప్పుతో పాటు, పచ్చిమిర్చి, పసుపు వేసి తగినన్ని నీరుపోసి మూడు విజిల్స్ వచ్చిన తరువాత దించుకొని మొత్తగా చేసుకొని తిరగమాత వేయలి.