కోళ్లు పెంపుడు పక్షులు. వీటిని కేవలం మాంసం, కోసం గుడ్లకోసం మాత్రమే పెంచుతారు. వీటిలో అనేక రకాల జాతులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పందెం కోళ్లకు పేరుపొందింది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాలు పందెం కోళ్లకు పేరుపొందాయి. పందె కోళ్లకు జీడిపప్పు, బాదం పప్పులతో పాటు బలమైన ఆహారం పెట్టి పెంచుతారు.సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రెండు జిల్లాలలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తారు.
నాటుకోళ్లు ఒక రోజుకు ఒకగుడ్డు చొప్పున కొన్నిరోజులపొటు పెడతాయి. ఈ గుడ్లు పొదిగి పిల్లలు రావటానికి షుమారు 21 రోజులు పడుతుంది. కానీ ఈ కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవతం 26 గంటలలనే ఈ గుడ్లును పొదగబెడుతున్నారు.
కోళ్లలో ఎక్కువగా చెప్పుకోవలసినవి నాటు కోళ్లు, ఫారం కోళ్లు, బాయిలర్ కోళ్లు. ఫారం కోళ్లను కేవలం మాంసంకోసం మాత్రమే కోళ్లఫారాలలో పెంచుతారు. నాటుకోళ్లు ఎక్కువగా పల్లెలలో పెంచుకుంటారు. వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది.
కోళ్లలో మగవాటిని పుంజులు అంటారు. ఇవి నాలుగు కిలోల దాకా బరువు పెరుగుతాయి. ఆడ వాటిని పెట్టలు అంటారు. ఇవి 3 కిలోల దాకా బరువు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా కోళ్ల పెంపకం ఉంది.
కోళ్లు గింజలను, బియ్యపు నూకలను, చిరు ధాన్యాలను, చిన్న చిన్నపురుగులను తింటాయి. వీటి జీవిత కాలం 8 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా బతకగలవు. కానీ సాధారణంగా మానవులు ఆహారం కోసం వీటిని ఒకటి నుండి రెండు సంవత్సరాల లోపే చంపివేస్తారు.
పౌల్ట్రీలలో (కోళ్ల ఫారాలు) పెరిగే కోళ్లు జీవితకాలం కొన్ని నెలలు మాత్రమే.