కొంగలు ధృవప్రాంతాలు, దక్షిణ అమెరికా దేశాలలో తప్ప మిగతా ప్రపంచమంతా ఉన్నాయి. వీటిలో 15 జాతులు ఉన్నవి. కొంగలకు పొడవైన మెడ, పొడవైన కాళ్లు ఉంటాయి. ఇవి ఎగిరేటపుడు తమ మెడను ముందుకు చాపి ప్రయాణిస్తాయి. ఇవి గుంపులు, గుంపులుగా నివసిస్తాయి. ఇవి ఎక్కువగా చిత్తడి నేలలు, చెరువుల దగ్గర నివసిస్తాయి. భారతదేశంలో పల్లెలలోనూ, చెట్లమీద, చెరువుల దగ్గర, పొలాలలోనూ ఎక్కువగా కనపడతాయి.
ఇవి ఆహారం కోసం చాలా దూరం ప్రయాణిస్తాయి. ఇవి తమ ఆహారం కోసం రోజుకు దాదాపు 500 మైళ్లు కూడా ప్రయాణిస్తాయి. చెరువులలోని చేపలు తమ పొడవైన ముక్కుతో నేర్పుతో పట్టుకుని తింటాయి.
ఇవి విత్తనాలు, పళ్లు, నత్తలు, పురుగులు, కప్పలు, చేపలను తింటాయి. వీటి జీవిత కాలం 20 నుండి 30 సవత్సరాల వరకు.