నల్లని ఈ పక్షులు అనగా కాకులు తెలివైనవి. ఇవి గుంపులు గుంపులుగా నివసిస్తాయి. ‘కా’ అని అరిచే వీటి అరుపు చాలా చికాకుగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవి 19 అంగుళాల పొడవు ఒకటిన్న కేజీల బరువు ఉంటాయి. కాకులు దాదాపు ప్రపంచమంతా కానవస్తాయి.
కాకులు ఆహారాన్ని కనుగొన్నపుడు అవి ఒంటరిగా తినవు. పెద్దగా అరచి తోటి కాకులు వచ్చిన తరువాత ఆహారాన్ని తింటాయి. ఒక కాకి ఏదైనా కారణంచేత చనిపోయినపుడు మిగతా కాకులు చనిపోయిన కాకి చుట్టూ తిరుగుతూ తమ సంతాపాన్ని తెలుపుతాయి.
కాకులు అన్నిటిని తింటాయి, గింజలు, పురుగులు, మానవులు పెట్టే ఆహారపదార్దాలు, ధాన్యాలు, కాయలను తింటాయి. ఇంకా ఎలుకలను, కప్పలను, చిన్న చిన్న జంతువులను, మాంసాన్ని, చనిపోయిన జంతుకళేబరాలను, చనిపోయిన ఎలుకలు, పందికొక్కులను కూడా తింటాయి. కాకులు ఎత్తైన చెట్లమీద పుల్లలతో గూళ్లు కట్టుకుని అందులో నివసిస్తాయి.
ఆడకాకి నాలుగు నుండి ఐదు గుడ్ల వరకు పెడుతుంది. వాటిని 18 రోజుల పాటు పొదుగుతుంది. 30 రోజుల తరువాత చిన్న కాకులు ఎగరగలవు. కానీ 60 రోజుల పాటు పెద్ద కాకులు పిల్ల కాకులకు ఆహారాన్ని సమకూరుస్తాయి. వీటి జీవితకాలం 14 సంవత్సరాలు