ఇవి పీజియన్ జాతికి చెందినవి. చిన్నగా కొద్దిగా పొడవాటి తోకతో తెలుపు, బూడిద రంగులలో ఉంటాయి. ప్రపంచమంతటా వీటిని పెంచుకుంటారు. పెంచుకునేవాటిని పెంపుడు పావురాలు అంటారు. పావురాల శాంతి చిహ్నాలుగా పరిగణిస్తారు
పురాతన కాలం నుండి వీటిని పెంచుకుంటున్నారు. పురాతన కాలంలో వీటిని వార్తలు చేరవేయటానికి ఉపయోగించుకునేవారు.
వీటి ఆహారం ధాన్యపు గింజలు, పండ్లు, చిన్న చిన్న మొక్కలను తింటాయి. ఇవి కొండ రాళ్ల సందులలోనూ, కొండ గుట్టలలోనూ నివసిస్తాయి. ఆధునిక కాలంలో అపార్టుమెంట్ల వద్ద పుల్లలతో గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి.
పావురాలు గుడ్లు పెడతాయి. మగ, ఆడ పావురాలు రెండూ గుడ్లను పొదుగుతాయి. పావురాల పిల్లలు 28 రోజుల తరువాత గూటిని వదలి ఎగిరిపోతాయి. వీటి జీవితకాలం చాలా తక్కువ. ఒకటిన్నర సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి..