ప్రస్తుతం బాతులు ఎక్కువగా కనబడకపోయినా ఒకప్పుడు బాతులు ఎక్కువగా ఉండేవి. ఇవి నేలమీద, నీళ్లలోనూ జీవించగలవు.
నీళ్లలో ఈదుతూ చేపలను, పురుగులను తింటాయి. వీటి గుడ్లు కోడిగుడ్లకంటే పెద్దవిగా ఉంటాయి. వీటిని మొసళ్లు, నక్కలు, గద్దలు, గుడ్లగూబలు వేటాడి తింటాయి. బాతులు సంవత్సరానికి 300 గుడ్లదాకా పెడతాయి. కానీ వీటిని తొందరగా పొదగవు. అందుకే వీటిని కొళ్లచేత గానీ, ఇంక్యుబరేటర్ లో కానీ పొదిగిస్తారు.
ఐదు నెలల వయస్సునుండి బాతులు గుడ్లను పెడతాయి. కొన్నిరకాల బాతులను కేవలం మాంసం కోసం పెంచుతారు. తెలుగు రాష్ట్రాలలో బాతులు కనబడవు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో బాతులను పెంచుకుంటారు.ఇవి 10 సంవత్సరాల దాకా జీవిస్తాయి.