
పక్షులలో గద్దలు కొంచెం పెద్దవిగా ఉంటాయి. చాలా ఎత్తులో ఎగురుతూ నేల మీద ఉన్న తన ఆహారాన్ని (కోడి పిల్లలు, చిన్న, చిన్న పక్షులు, పిచ్చుకలు) గుర్తించగలవు. గుర్తించిన వెంటనే అత్యంతవేగంతో నేలమీదకు వచ్చి తన ఆహారాన్ని కాలి గోళ్లతో బంధించి చెట్లమీద కూర్చొని వాటిని తీరికగా తింటాయి. చిన్న చిన్న పక్షులకు గద్ద శత్రువు. ఇవి కుందేళ్లను, చేపలను, ఎండ్రకాయలను కూడా వేటాడి తింటాయి.
వీటి రెక్కలు చాలా పెద్దవిగా ఉంటాయి. రెండు రెక్కలు విప్పినపుడు ఏడు అడుగుల పొడవుగా కూడా ఉంటాయి. ఇవి మూడు నుండి ఆరున్నర కేజీలు బరువు ఉండవచ్చు. ఇవి కొన్నివందల మైళ్ల దూరం ఎగరగలవు.
ఆడ గద్ద ఒకటి నుండి మూడు గుడ్లదాకా పెడుతుంది. 30 రోజుల పాటు గుడ్లు పొదగబడి గుడ్లలోనుండి పిల్లలు బయటకు వస్తాయి. మామూలు గద్దలు 28 సంవత్సరాలు, అడవి గద్దలు 36 సంవత్సరాలు జీవిస్తాయి