పాలపిట్ట తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిట్టలు. ఇవి చెట్లలలోనూ, పొదలలోనూ, గడ్డి భూములలోనూ నివసిస్తాయి.
వీటిలో మగవి, ఆడవి రెండూ ఒకేలాగా ఉంటాయి. వీటి రెక్కలు లేత, ముదురు నీలం రంగులో, పొట్ట మెడభాగాలు ముదురు గోధుమరంగుమీద తెల్లటి చారికలతో ఉంటాయి. ఇవి కేవలం 90 గ్రాములు మాత్రమే ఉంటాయి.
ఈ అందమైన పక్షి కూత మాత్రం వినసొంపుగా ఉండదు. కాకిలాగా లేక రేకుడబ్బా మీద గీసినట్లు అరుస్తుంది. ఈ పిట్టలు ఎగురుతూ విన్యాసాలు చేస్తాయి కనుక వీటిని ఇంగ్లీష్ లో Roller Birds అని అంటారు. ఇవి చేసే విన్యాసాలకు చక్కగా ఉంటాయి. ముక్కు నిటారుగా పెట్టి నిలువుగా ఎగురుతాయి.
ఇవి బాణంలాగా దూసుకుపోగలవు. అలాగా చేపపిల్లలను పట్టుకుని తింటాయి. కప్పలు, చిన్న, చిన్న పాములు, మిడతలను తింటాయి.
ఆడ పాలపిట్ట 3 నుండి 5 గుడ్లవరకు పెడుతుంది. మగ, ఆడపిట్టలు రెండూ గుడ్లను పొదుగుతాయి. 19 రోజుల తరువాత గుడ్లనుండి పిల్లలు బయటకు వస్తాయి. 30 రోజుల తరువాత వీటికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. భారదేశంలో వీటి జీవితకాలం 17 సంవత్సరాలు.