పాటలు మనోహరంగా పాడేవారి గొంతులను కోకిల కంఠమని అంటారు. వీటి అరుపు వినసొంపుగా ఉంటాయి. ఆడ కోకిలలు బూడిద రంగులో మగ కోకిలలు నల్లని రంగులో ఉంటాయి. 6 అంగుళాల పొడవుతో పొట్టి రెక్కలను కలిగి ఉంటాయి. కోయిలలో 127 రకాలున్నాయి.
ఆడపక్షులు గుడ్లను పెట్టిన తరువాత వాటిని పొదగవు. తెలివిగా వాటిని ఒక్కో కాకి గూటిటో ఒక్కోటి చోప్పున ఉంచి దాని బదులు ఒక్క కాకి గుడ్డును తింటాయి లేక కిందికు తోసి లెక్క తేడా రాకుండా చూసుకుంటాయి. కాకులు వాటిని తమ గుడ్లుగా భావించి పొదుగుతాయి. గుడ్లనుండి పదకొండు, పన్నెండు రోజులలో పిల్లలు వస్తాయి. వారం రోజుల తరువాత రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి.
ఇవి మిడతలను, గొంగళి పురుగులను, కప్పలు, కీటకాలను తింటాయి. కానీ వసంతకాలంలో మాత్రం వీటి ఆహారం మారిపోతుంది. మామిడి చిగుళ్లు, వేపచిగుళ్లు, వేప పండ్లు, అత్తిపండ్లు, జామపండ్లను తింటాయి. వీటి జీవితకాలం 12 నుండి 15 సంవత్సరాలు