మైనాలు (గోరింకలు) అతి చిన్న పక్షులు. పిచ్చుకల కంటే కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కొబ్బరి, తాటి చెట్లపై, చెట్ల రంధ్రాలలోనూ గూళ్లు కట్టుకుని నివసిస్తాయి. ఇంకా అడవులలోనూ, పొదలలోనూ నివసిస్తాయి. వీటి అరుపు సంగీతంలాగా వినూత్నంగా ఉంటుంది.
ఇవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ ఆసియా, ఇండోనేసియా దేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ఆడ, మగ మైనాలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి.
వీటి ఆహారం పండ్లు, గింజలు, చిన్న, చిన్న పురుగులు. ఆడ మైనాలు పెట్టిన గుడ్లను ఆడవి, మగవి సంరక్షిస్తాయి. వీటి బరువు 170 గ్రాముల నుండి 250 గ్రాముల వరకు ఉండవచ్చు. ఆరంగుళాల నుండి 8 అంగుళాల పొడవు ఉంటాయి. వీటి జీవితకాలం 12 నుండి 25 సంవత్సరాల వరకు.