పక్షులలో అతి పెద్దవి, ఎగరలేనివి నిప్పుకోళ్లు. పొడవైన మెడ, బలమైన కాళ్లతో ఉంటాయి. వేగంగా పరిగెత్తగలవు. ప్రపంచంలోనే పక్షిజాతులలో ఇవి పెద్దవి.145 కిలోల బరువు, 4,5 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. వీటి కళ్లు పెద్దగా ఉంటాయి. దాదాపు రెండు అంగుళాల వ్యాసంలో గుండ్రంగా ఉంటాయి.
ఇవి పొడినేలలో ఎక్కువగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా విత్తనాలను, ఆకులను, దుంపలను తింటాయి. ఇవి శాఖాహారంతో పాటు మాంసాహారం కూడా తింటాయి. ఇవి మిడతలను, ఎలుకలను, పాములను, బల్లులను తింటాయి. ఇవి నీటిని తాగవు. ఆకులను తిన్నపుడు వచ్చే నీరే వీటికి సరిపోతుంది.
ఇవి చిన్న చిన్న గుంపులు గుంపులుగా నివసిస్తాయి. సాదారణంగా మగ నిప్పుకోడి ఈ గుంపుకు నాయకత్వం వహిస్తుంది. వీటి గుడ్లు 6 అంగుళాల పొడవుగా ఒకటిన్నర కిలోల బరువు ఉంటాయి. ఈ గుడ్లను మగ పక్షులు, ఆడ పక్షులు కూడా పొదుగుతాయి. 46 రోజులపాటు పొదగబడతాయి. ఇవి ఆరు నెలల కాలంలో పూర్తిగా ఎదుగుతాయి. 4 సంవత్సరాలకు సంతాన సామర్ద్యం పొందుతాయి. వీటి జీవితకాలం షుమారు 50 నుండి 75 సంవత్సరాలు. బారతదేశంలో వీటిని జూపార్కులలో చూడవచ్చు.