గుడ్లగూబలు దృవప్రాంతాలలో తప్పితే ప్రపంచమంతటా ఉన్నాయి. చెట్ల మీద, అడవులలో ఎక్కువగా నివసిస్తాయి. ఇవి మానవులకు హానిచేసే అనేక కీటకాలను, చిన్న చిన్న జంతువులను తిని పర్యావరణానికి మేలు చేస్తాయి.
భారతదేశంలో గూడ్లగూబలను అపశకునపు పక్షులుగా భావిస్తారు. వీటి రూపం మిగతా పక్షులకు భిన్నంగా ఉండటం, వీటి అరుపులు కొంచెం భయపెట్టే విధంగా ఉండటం వలన ఈ అభిప్రాయం వచ్చింది. కానీ ఇవన్నీ ఒట్టి అపోహలు మాత్రమే అంటున్నారు.శాస్త్రజ్ఞులు. హిందువుల కొలిచే లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అందుచేత ఇవి కనబడితే శుభసూచకంగా భావించాలంటారు.
గుడ్లగూబ రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తుంది. చిన్న శబ్ధాలను కూడా స్పష్టంగా వినగలదు. చాలామంది గుడ్లగూబలను శుభవకునంగా భావిస్తారు. ప్రయాణం చేసేటపుడు అవి కనబడితే మంచి జరుగుతుందని భావిస్తారు.