నెమళ్లు అందమైన పక్షులు...చాలా పక్షిజాతులు అంతరించిపోతున్నా నెమళ్లు మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. నెమలి బారతదేశ మరియు శ్రీలంక జాతీయ పక్షి. మగనెమలి అనేక పింఛాలతో చూపరులను ఆకట్టుకుంటుంది. మగనెమలికి మాత్రమే పొడవాటి ఈకలుంటాయి. వీటి అందం పురివిప్పి నాట్యం చేసేటపుడు చూడాలి. మగనెమలి పురివిప్పి నాట్యం చేసేటపుడు వీటి అందానికి ఆడనెమళ్లు ఆకర్సింపబడతాయి. ఆడ నెమలి, మగ నెమలి కళ్ల నుండి వచ్చే నీటిని తాగి గుడ్లను పెడుతుందంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. మగనెమలి ఆడనెమలితో సంగమించినపుడు మాత్రమే గుడ్లు పెడతాయి.
వీటి ఆహారం పూవుల రెక్కలు, విత్తనాలు, కీటకాలు, బల్లులు, కప్పలు. ఇవి మిగతా పక్షులు లేక జంతువులతో అంతగా కలవవు. భారతదేశంలో నెమలిని చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని వేటాడటం నిషేదం. కుమారస్వామి వాహనం నెమలి. శ్రీకృష్ణ భగవానుడు నెమలి పింఛాన్ని తన కిరీటంలో ధరిస్తాడు.
ఆడనెమలి మగనెమలితో కలసిన తరువాత మూడు నుండి ఆరు గుడ్లవరకు పెడుతుంది. ఈ గుడ్లు ఆడనెమలిచే 29 రోజుల పాటు పొదగబడతాయి. ఇవి పూర్తిగా పెరగటానికి మూడు సంవత్సరాలు పడుతుంది. ఆడ నెమళ్లు మాత్రం రెండు సంవత్సరాలకు సంతాన సామర్ధ్యాన్ని పొందుతాయి.
భారతదేశపు నెమళ్లు 10 నుండి 25 సంవత్సరాల వరకు జీవిస్తాయి. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో నెమళ్లు ఎక్కువగాఉన్నాయి.