పిచ్చుకలు పురాతన కాలం నుండి మానవుల నేస్తాలు. భారతదేశంలోని గ్రామాలలో పంటలు ఇంటికి తెచ్చుకున్న సమయంలో కొన్ని ధాన్యపు కంకులను ప్రత్యేకంగా పిచ్చుకల కోసం ఇళ్ల చూరులకు వేలాడదీసేవారు.
పిచ్చుకల చాలా చిన్నగా బూడిద రంగులో, బలమైన పొట్టిముక్కు కలగి ఉంటాయి. ఇవి గడ్డి, చిన్న చిన్న పుల్లలతో గూడు కట్టుకుని అందులో నివసిస్తాయి. ఇవి కేవలం నాలుగు అంగుళాల పొడవు ఉంటాయి. ఇవి గింజలను, చిన్న చిన్న పురుగులను తింటాయి. అనాది నుండి మానవుల నివాసాలకు దగ్గరగా నివసిస్తున్నాయి.
ఆహార కొరత, పట్టణాల ఆధునీకరణ, సెల్ ఫోన్ టవర్ల తరంగాల మూలంగా పిచ్చుకల జాతి అంతరించిపోతున్నది. ప్రపంచ దేశాలు మార్చి 20వ తేదీని పిచ్చుకల దినోత్సవంగా ప్రకటించాయి.
కుక్కలు; నక్కలు, పాములు, పిల్లులు వీటికి ప్రదాన శత్రువులు. ఆడపిచ్చుకలు సంవత్పరానికి ఒకసారి 3 నుండి 5 వరకు గుడ్లను పెడుతాయి. 12 నుండి 15 రోజుల పాటు ఈ గుడ్లు పొదగబడతాయి. 15 రోజుల తరువాత చిన్న పిచుకలు ఎగరగలవు. వీటి జీవిత కాలం 4 నుండి 5 సంవత్సరాలు.