<
హంసలు అందమైన పక్షులు. తెల్లని రంగులో మెరసిపోతూ ఉంటాయి. నల్లరంగు హంసలు కూడా ఉన్నాయి. ఇవి ఉత్తరదృవంలోనూ, అస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో ఉన్నాయి. భారతదేశంలో వేదకాలం నుండి హంసల ప్రస్తావన ఉంది. ఇవి చూడటానికి పెద్ద బాతులులాగా ఉంటాయి. చదువుల తల్లి సరస్వతీ మాత వాహనం హంస. హంసలకు పాలను నీటిని వేరుచేయగల శక్తి ఉందంటారు. పాలను, నీళ్లను కలిపి హంస ముందు పెడితే హంస పాలను మాత్రం తాగి నీళ్లను మిగిలిస్తుందని అంటారు.
హంసలకు పొడవైన మెడ, పొడవైన కాళ్లు ఉంటాయి. ఆడ హంసలకంటే మగ హంసలు పెద్దవిగా ఉంటాయి. ఇవి భారతదేశంలో కానీ, ఆసియా ఖండంలో కానీ లేవు.
ఇదివరకు హిమాలయాలలోని మానససరోవరం హంసలకు ప్రసిద్ది. కానీ వాతావరణ మార్పులవలన నేడు హంసలు కనబడటం లేదు.
హంసలు నీటిమీద నివసించే పక్షులు. ఆకాశంలో నిదానంగా ఎగురుతూ చాలా దూరం ప్రయాణించగలవు. ఇవి నేలమీద కూడానివసిస్తాయి. చెట్ల ఆకులు, వేర్లు, నీటిలో పెరిగే చెట్ల కాండాలను తింటాయి.
ెలల కాలంలో పూర్తిగా ఎదుగుతాయి. 4 సంవత్సరాలకు సంతాన సామర్ద్యం పొందుతాయి. వీటి జీవితకాలం షుమారు 50 నుండి 75 సంవత్సరాలు. బారతదేశంలో వీటిని జూపార్కులలో చూడవచ్చు.